రాజకీయాలకతీతంగా అభివృద్ధి: బుర్రి శ్రీనివాస్ రెడ్డి

Development without politics: Burri Srinivas Reddy– విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
– మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
– మర్రిగూడలో రూ.54 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ మున్సిపాలిటీని రాజకీయాలకు అతీతంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ మున్సిపాలిటీలోని 14వ వార్డు మర్రిగూడలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ప్రాస్ట్రాక్టర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టి ఎఫ్ ఐ సి) కింద రూ.54 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ బొజ్జ శంకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో వచ్చే రెండేళ్లలోపు నల్గొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.అన్ని వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను, మంచినీటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. గతంలో నల్గొండ పట్టణంలో కొన్ని మెయిన్ రోడ్లు వేశారే తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. పట్టణంలో అన్ని వార్డుల అభివృద్ధితో పాటు వీలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.ఔటర్ రింగ్ రోడ్ పై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీనిపై కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వలన నష్టపోయే వారికి సరైన పరిహారం చెల్లించడం జరుగుతుందని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, స్థానిక కౌన్సిలర్ బోజ్జ శంకర్, వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గురిజ వెంకన్న గౌడ్, కౌన్సిలర్లు జేరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్,పబ్బు సాయి,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.