బీఆర్‌ఎస్‌ హయంలోనే అభివృద్ధి

– ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
నవతెలంగాణ-చందానగర్‌
బీఆర్‌ఎస్‌ హయంలోనే అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. చందానగర్‌ డివిజన్‌ పరిధిలోని దీప్తి శ్రీ నగర్‌, సిటిజన్‌ కాలనీ, సురక్ష ఎనక్లేవ్‌, శంకర్‌ నగర్‌ కాలనీలలో రూ.87.00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రయినే జీ యూజీడీ పైప్‌లైన్‌ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తా మన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ మంజుల రఘునాథ్‌ రెడ్డి, జలమండలి అధికారులు డీజీమ్‌ నాగప్రియ, మేనేజర్లు సుబ్రమణ్యం, పూర్ణేశ్వరి, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.