
నవతెలంగాణ – మల్హర్ రావు
అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లుతొందని, వీటిని విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటమి తప్పలేదని తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కాటారం మండల కేంద్రానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ శ్రేణులు అడుగడుగునా పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. గంగారాం ఎక్స్ రోడ్డు నుండి ప్రత్యేక ప్రచార వాహనంలో దేవరంపల్లి,శంకరంపల్లి, గొల్లపల్లి ధన్వాడ కిష్టంపేట గ్రామాల మీదుగా కాటారం మండల కేంద్రానికి విజయోత్సవ ర్యాలీతో చేరుకొన్నారు.పులదండలతో, పులు చల్లుతూ మంగళ హారతులు ఇస్తు మంత్రి శ్రీధర్ బాబుకు కాటారం మండల ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది, మహిళలలు కొలాటాలతో యువకుల డాన్సులతో భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ ఆనందంతో విజయా యాత్రా నిర్వహించారు.మంత్రి నా ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకీ నాయకులకీ నాయకురాలకి పేరు పేరున వారికీ వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.తెలిపారు.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాటారం మండల కేంద్రంలో మెడికల్ కాలేజి,కాళేశ్వరం, రామగిరి గుట్టలను పర్యాటక కేంద్రాలుగా మార్చి అభివృద్ధి చేస్తామన్నారు.కాటారం నుంచి పెద్దపల్లి వరకు 60 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిగా మారుస్తనన్నారు.పదేళ్ల కాలంలో తన తండ్రిని తీవ్రంగా విమర్శించడమే కాక రౌడీయిజం,గూండాయిజం చేసినప్పటికీ ఓపికతో ఉన్నట్టుగా తెలిపారు.బిఆర్ఎస్ నాయకులు ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు ఆశీర్వదించారని వారికి అందుబాటులో ఉంటూ సేవలందిస్తానన్నారు.పనుల నిమిత్తం ఎవరు హైదరాబాద్ కు వచ్చి ఖర్చుల పాలై ఆగం కావద్దని,ఎవరికి ఇబ్బందులు ఉన్న,కష్టం వచ్చిన మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన సిబ్బందికి దరఖాస్తుల రూపంలో ఇస్తే వెంటనే సమస్యలు తీరుస్తాన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా బాధ్యత తమదేన్నారు.