– ఇముల్ నర్వాలో పార్టీ కార్యాలయం ప్రారంభం
– కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్
– బీఆర్‌ఎస్‌లో పలువురు చేరిక
నవతెలంగాణ-కొత్తూరు
బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని ఇముల్ నర్వ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం విభిన్న రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే బీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్ బీఆర్‌ఎస్ నియోజకవర్గం అభ్యర్థి ఎలగనమోని అంజయ్య యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్య నారాయణ వారికి పార్టీ కాండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
మున్సిపాలిటీలో
మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ వార్డు సభ్యులు ఇరిగిజ రమేష్, అనురూప రమేష్‌లతో పాటు తదితరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ అజరు నాయక్, వైస్ ఎంపీపీ శోభ లింగం నాయక్, ఎంపీటీసీ రాజేందర్ గౌడ్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మెండే కృష్ణ యాదవ్, సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్, పెంట నోళ్ళ యాదగిరి, టిఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు కడల శ్రీశైలం, గోపాల్ నాయక్, మిట్టు నాయక్, శంకరయ్య గౌడ్, భాస్కర్ గౌడ్, నర్సింహా గౌడ్, ఇంద్రసేన రెడ్డి, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.