కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి సీతక్క

– రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క
– మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– కాటాపూర్ లో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
నవతెలంగాణ – తాడ్వాయి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి ప్రజలు పార్టీకి పట్టం కట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. సోమవారం మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట కాటాపూర్ లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో గీత కార్మికులు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ను ఘనంగా సన్మానించారు. అనంతరం కాటాపూర్ చర్చి సిసి రోడ్డు, కాటా పూర్ లోని మసీద్ కు కాంపౌండ్ వాల్, పంభాపూర్ రామాలయానికి కాంపౌండ్ వాల్, బీటీ రోడ్డు, పాత పంభాపూర్ లో సిసి రోడ్డు, బీరెల్లి, నర్సాపూర్, వీరాపూర్, రంగాపూర్ గ్రామాలలో సిసి రోడ్లను కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను చూసి అందరూ పార్టీ వైపే చూస్తున్నారని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. అభ్యాసం 6 గ్యారంటీలో భాగంగా నేడు భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, మేడారం ట్రస్ట్ బోర్డ్ ఉత్సవ కమిటీ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కళ్యాణి, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, తెలంగాణ కలుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి నరసయ్య గౌడ్, సీనియర్ నాయకులు బెల్లంకొండ రోశయ్య, మద్దూర్ రాములు, పులి రవి గౌడ్, మాజీ సర్పంచులు బెజ్జూరి శ్రీనివాస్, ఇర్ప అశ్విని సూర్యనారాయణ, బడే రాంబాబు, ముజాఫర్ హుస్సేన్, లంజపల్లి నరసయ్య,ఎల్లబోయిన జానకి రాంబాబు, యూత్ అధ్యక్షులు కోడి సతీష్, నాయకులు ముత్తినేని లక్ష్మయ్య, పల్నాటి సత్యం, మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ నాలి కన్నయ్య, చిరంజీవి, అల్లెం సాంబశివరావు, రెహమాన్, ఫయాజ్, మేడిశెట్టి పుల్లయ్య, రామారావు ఊరుకొండ స్వామి మర్రి నరేష్, లక్ష్మయ్య, సారయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘం నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.