
నవతెలంగాణ – చండూరు
కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులుబండి మీద ఎల్లయ్య అన్నారు. చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి, వివరిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలనివారు అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోఅమలు చేసి,పేదల జీవితాల్లోవెలుగులు నింపారనివారు అన్నారు. అధికారం కోసం దొంగ హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నమ్మవద్దని,చెయ్యికి ఓటు వేస్తేకష్టాలు తప్పవనివారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలుప్రవేశపెట్టారని, పేదలకు ఎల్లప్పుడూబిఆర్ఎస్ అండగా ఉంటుందనివారు తెలిపారు.తెలంగాణలో మళ్లీకేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోగ్రామ శాఖ అధ్యక్షులు నారపాక శంకర్, గ్రామ సర్పంచ్నందికొండ నరసింహారెడ్డి,బూత్ కన్వీనర్లు కొంపెల్లి శంకర్, ఈరగట్ల నరసింహ, బొడ్డుపల్లి రాములు, నారపాక ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.