మంత్రి ఎర్రబెల్లి తోనే అభివృద్ధి సాధ్యం: శర్మ

నవతెలంగాణ పెద్దవంగర: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారథ్యంలో పాలకుర్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి సాధించిందని మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు చెరుకు యాకయ్య,  సీనియర్ నాయకులు చిలుక వెంకటయ్య, యూత్ నాయకులు చిలుక సిద్దు, చిలుక మహేష్, జలగం యాకన్న, చెరుకు పెద్ద యాకన్న, చెరుకు నవీన్ తదితరులు పాల్గొన్నారు.