కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్ ల అభివృద్ధి

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్ ల అభివృద్ధి చేసుకొని వైద్యం అందిస్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. మాతా శిశు సంరక్షణలో న్యూట్రీషన్‌ కిట్లు,కేసీఆర్‌ కిట్ల పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, అక్కన్నపేట ఎంపీపీ లక్ష్మి బిలు నాయక్ , డాక్టర్ వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు.