
– మద్నూర్ మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి
– గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి నా ప్రధాన లక్ష్యమని, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాలని మద్నూర్ మండల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన గణతంత్ర దినోత్సవం వేడుకల సభలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థుల ఆటపాటలను తిలకించారు. విద్యార్థినీ విద్యార్థుల ఆటపాట ఎమ్మెల్యేను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ జుక్కల్ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. మండలం ప్రత్యేకంగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేక కృషి చేస్తానని ప్రజల సహకారం అవసరమని తెలిపారు. మొట్టమొదటిసారిగా కౌలాస్ కిల కోట పైన జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం ఎమ్మెల్యే కృషికి ప్రతి ఒక్కరు అభినందించారు తాసిల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన గణతంత్ర వేడుకల కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.