
నవతెలంగాణ – రాయపర్తి
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొండూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ కర్ర సరిత రవీందర్ రెడ్డి అన్నారు. ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవి కాలం ముగుస్తున్న సందర్భంగా వారి మనోగతని తెలిపారు.. తెలంగాణ రాష్ట్ర పితామహుడు కేసీఆర్ సారధ్యంలో సాధించిన రాష్ట్రంలో సొంత గ్రామానికి సర్పంచ్ స్థానంలో నిలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. సొంత గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని వ్యాఖ్యానించారు. ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో గ్రామస్తులు చేసిన సహకారం మరువలేనిది అని తెలిపారు. లక్షల రూపాయలతో గ్రామానికి కావలసిన అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజ్, వీధి లైట్లు, త్రాగునీరు, బతుకమ్మ ప్రగణం, క్రీడా ప్రగణం, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం వంటివి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అభివృద్ధికి క్షేత్రస్థాయిలో ప్రజా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారం వివరించలేనిది అని కొనియాడారు. గ్రామ పాలనకు సహకరించిన గ్రామస్తులకు, యువతకు, గ్రామస్థాయి అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.