ప్లాస్టిక్ రహిత గ్రామం గా పసర అభివృద్ధి

– శరత్ బాబు గ్రామపంచాయతీ కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్లాస్టిక్ రహిత గ్రామంగా పసర ను అభివృద్ధి చేసుకుందామని పంచాయతీ కార్యదర్శి పూణేo శరత్ బాబు అన్నారు. మంగళవారం పంచాయితీ పరిధిలో సంత సందర్భంగా అన్ని దుకాణ సముదాయాలను తిరుగుతూ ప్లాస్టిక్ ను వినియోగించవద్దని సూచించారు. ఈ సందర్భంగా కార్యదర్శి శరత్ బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ దెబ్బతింటుందనీ కాలుష్యం అవుతుందని అన్నారు.ముందు తరాల అభివృద్ధి  జీవన ప్రమాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్నారు. భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండేందుకు ప్లాస్టిక్ ను నివారించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని సూచించారు. వ్యాపార సముదాయాలలో ప్లాస్టిక్ ను వినియోగించవద్దని  వ్యాపారులకు గ్రామపంచాయతీ తరఫున నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పూనెం శరత్ బాబు, బిల్ కలెక్టర్ కుమార్, జూనియర్ అసిస్టెంట్లు అంజుమ్ ,శ్వేత మరియు సంపత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.