ప్రజాసంక్షేమం, గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్
ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. మద్నూర్ మండలంలోని దన్నూర్ గ్రామంలో ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం గ్రామాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేకు దన్నూరు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవిదాస్ పటేల్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు యాదవ్ పటేల్, విట్టల్ రావు పటేల్, మనోహర్ దేశాయ్, సంగమేశ్వర్ మధుకర్, ఆ గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు ఇతర గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.