ఉద్యమంలా తెలంగాణ అభివృద్ధి

– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌
ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న అనంతరం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి ఉద్యమంల జరిగిందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి అనంతరం ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని భారతదేశంలో ఇతర రాష్ట్రాల వాళ్లు చూసి అదేవిధంగా అభివృద్ధి సాధించాలని కోరు కుంటున్నారన్నారు.చావు అంచుల చివరి వరకు వెళ్లి తెలంగాణను సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు.హుజూర్‌నగర్‌ పట్టణంలో మిగిలిపోయిన ప్రధాన రోడ్డు నిర్మాణంతో పాటు అన్ని రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లిఅర్చనరవి,కమిషనర్‌ వెంకటేశ్వర్లు,వైస్‌చైర్మెన్‌ నాగేశ్వర్‌రావు, కౌన్సిలర్లు ఓరుగంటి నాగేశ్వరరావు, దొంగరిమంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో…తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరించిన సోనియాగాంధీ చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పారాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌,దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు ఎరగాని నాగన్న, టీపీసీసీ ప్రతినిధి దొంగరి వెంకటేశ్వర్లు, కష్టాలశ్రవణ్‌, బాచమంచి గిరిబాబు, సంపత్‌రెడ్డి,జక్కుల మల్లయ్య, ఎస్‌కె.సైదా, యోహన్ ముక్కంటి రాములు, ఎస్‌.చంద్రశేఖర్‌, జయరాజు, దాసరి బాబు, తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు: మండలకేంద్రంలో ఆయా పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.మండలంలోని 17 గ్రామాలలో తెలంగాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు.
చివ్వెంల: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రంగారావు, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ధరావత్‌ కుమారిబాబునాయక్‌,ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం కార్యాలయంలో పీఏసీఎస్‌ చైర్మెన్‌ మారినేని సుధీర్‌రావు జాతీయపతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలందరూ అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలసి మమేకమై రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.అదేవిధంగా మండలవ్యాప్తంగా గ్రామగ్రామాన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీవో గోపి, డిప్యూటీ తహసీల్దార్‌ ఝాన్సీ, పీఏసీఎస్‌ వైస్‌చైర్మెన్‌ సైదులు, సీఈఓ శ్యాంసుందర్‌రెడ్డి, ఏపీఓ నాగయ్య, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఆశాకుమారి, పంచాయతీరాజ్‌ ఏఈ లింగానాయక్‌, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధరావత్‌ బాబునాయక్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జూలకంటి సుధాకర్‌రెడ్డి, మిర్యాలగోవిందరెడ్డి, లచ్చిరాంనాయక్‌,శ్రీధర్‌,దిలీప్‌, ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయసహకారసంఘం కార్యాలయ సిబ్బంది,తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో… మండలపరిధిలోని సూర్యనాయక్‌తండాలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ధరావత్‌ వీరన్ననాయక్‌ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్‌ నాయకులు ధరావత్‌ పాండునాయక్‌, పఠాన్‌, సమీర్‌, లాలు నాయక్‌,వీరన్న, తులసీరామ్‌, నిరోజ, శంకర్‌, నరేష్‌, అనిత, విజయ పాల్గొన్నారు.
తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గకేంద్రంలోని పలు ప్రభుత్వ ప్రయివేట్‌ కార్యాలయాలతో పాటు,మండల పరిధిలోని వివిధ గ్రామాలలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ మేరకు తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌కోర్టులో జడ్జి ఆర్‌.శాలిని,మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్‌,తహసీల్దార్‌ కార్యాలయంలో,తహసీల్దార్‌ రాంప్రసాద్‌,వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ, మండల వనరుల కేంద్రం నందు మండల విద్యాశాఖ అధికారి బోయినిలింగయ్య, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ డానియల్‌కుమార్‌, గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మెన్‌ గోపగాని రమేష్‌గౌడ్‌, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆరాధ్య ఫౌండేషన్‌ చైర్మన్‌ తాడోజువాణి శ్రీకాంత్‌రాజ్‌,కాంగ్రెస్‌ కార్యాలయం నందు టీపీసీసీ నాయకులు గుడిపాటి నర్సయ్య, సొసైటీ కార్యాలయం నందు డీసీసీబీ డైరెక్టర్‌ గుడిపాటి సైదులు,వెలుగు కార్యాలయంలో ఏపీఎం నర్సయ్య, ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీఓ కృష్ణ,అదేవిధంగా కళాశాలలో, పాఠశాలలలో ఆయా కళాశాలల ,పాఠశాలల ప్రిన్సిపాళ్లు జాతీయజెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ తెలంగాణతల్లి విగ్రహానికి వందనాలు సమర్పించారు.9 ఏండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు అభివృద్ధి సంక్షేమఫలాల గురించి నివేదిక వివరించారు.ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ,ప్రయివేట్‌ కార్యాలయాల సిబ్బంది, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
‘మేరీమదర్‌’లో…మన సంస్కృతి,సంప్రదాయాలను,తెలంగాణ వైభవాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మండలకేంద్రంలోని మేరీమదర్‌ పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ మేరీ రిన్సీ అన్నారు.తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలువేసి, తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆటుపోట్లను,రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ రాష్ట్రం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో సిస్టర్‌ హెలెన్‌, ఉపాధ్యాయ బృందం గోపగాని లింగమూర్తి, వీరమల్లు, సతీష్‌, నబి ,అశోక్‌, మహేష్‌, సుకన్య, అనిత, సఫియా, యమున తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట:నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ నాటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని కాంగ్రెస్‌ జిల్లాఅధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు.రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన జాతీయజెండాను ఎగురవేశారు.అనంతరం కొత్త బస్టాండ్‌ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రధాత సోనియాగాంధీ చిత్రపటానికి పటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణఅధ్యక్షులు ఎండి.అంజద్‌అలీ, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్‌రావు, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కక్కిరేణి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ వేములకొండ పద్మ,సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌, అబ్దుల్‌ రహీం,రుద్రంగి రవి,పోలగాని బాలుగౌడ్‌, పిండిగ విజరుకుమార్‌, పిడమర్తి మల్లయ్య,అక్కెనపల్లి జానయ్య, నాగుల వాసు,కుందమల్లశేఖర్‌, నెల్లుట్ల లింగస్వామి,గడ్డం వెంకన్న, ఆలేటి మాణిక్యం, రెబల్‌ శ్రీను,రావుల రాంబాబు,బైరు నాగరాజుగౌడ్‌, పందిరివెంకన్న, అన్నయ్య రాము, చెరుకురాము,కోడి శివ, అబ్బాస్‌,బంధంవిష్ణు, మాడనవీన్‌, నరేందర్‌నాయుడు,సైదా,ఖాశీం, చెరుకు సాయి, తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్‌: వాడవాడల రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ చేతులమీదుగా జెండాను ఆవిష్కరింపజేశారు.మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ నిర్వహించి సిబ్బందికి మిఠాయి పంపిణీ చేశారు.పట్టణంలోని కోర్టులో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్యాంసుందర్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి భవ్య, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సత్యనారాయణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జునరావులతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది జాతీయ నాయకులు, తెలంగాణ అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు.అంతరం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్యాంసుందర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌ శర్మ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ముత్యాలు, వార్డు కౌన్సిలర్‌ కల్లూరి పద్మజ, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి కౌన్సిలర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.
అదేవిధంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పదేండ్లలో వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కేసీఆర్‌దేనని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గపరిధిలోని ఉద్యమకారులకు కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్‌రావు, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ముత్తవరపు పాండురంగారావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ 100 మంది నాటి ఉద్యమకారులను పుష్పగుచ్ఛాలతో శాలువాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిలుకూరు జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, అనంతగిరి జెడ్పీటీసీ కొనతం ఉమా శ్రీనివాస్‌రెడ్డి, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య , మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ మున్సిపల్‌ కౌన్సిలర్‌ పెండెం వెంకటేశ్వర్లు,తిపిరిశెట్టి సుశీలరాజు, గుండపనేని పద్మ నాగేశ్వరరావు, కందులమధు, మండల మాజీ జెడ్పీటీసీ గరిణే కోటేశ్వరరావు, జెర్రీపోతులగూడెం ఎంపీటీసీ మద్ది పద్మ వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాల మాజీ, ప్రస్తుత అధ్యక్షులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో… పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో తెలంగాణ తల్లి సోనియాగాంధీ అంటూ ఆమె చిత్రపటానికి కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పద్మావతి శుక్రవారం పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్‌ పారా సీతయ్య, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు,మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కందుల కోటేశ్వరరావు, శ్రీనివాస్‌రెడ్డి,కౌన్సిలర్లు గంధం యాదగిరి, షాబుద్దీన్‌, కర్రి సుబ్బారావు, లంకెల నిరంజన్‌రెడ్డి,పిడతల శ్రీను, కంపాటి శ్రీను,బాగ్దాద్‌, శమి, రజనీకాంత్‌, దావల్‌, దాదావలి, తదితరులు పాల్గొన్నారు.
నాగారం: మండల కేంద్రంంలోని తహీసల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ హరిశ్చంద్రప్రసాద్‌ జాతీయజెండాను ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని, జాతీయ గీతాన్ని పాడారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజేశ్‌, ఎంపీడీఓ శోభారాణి, పంచాయతీరాజ్‌ డీఈ కొండయ్య, ఏవో గణేష్‌, ఎస్సై ముత్తయ్య పాల్గొన్నారు.మండలకేంద్రంలో జాతీయజెండాను బీఆర్‌ఎస్‌ మండలఅధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమితి మండల కోఆర్డినేటర్‌ గుండగాని అంబయ్యగౌడ్‌,బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షులు దోమల బాలమల్లు, ఈదుల కిరణ్‌కుమార్‌, తరాల ఆంజనేయులు,కన్నెబోయిన మల్లేశ్‌, మండలనాయకలు వడ్డె పరుశరాములు, కుంభం కర్నాకర్‌, కేశగాని అంజయ్య, బోయని లింగమల్లు, చిల్లర చంద్రమౌళి,సంపెట అశోక్‌, ఎర్ర నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో.. మండలకేంద్రంతో పాటు పస్తాల, ఫణిగిరి,పసునూరు గ్రామాలలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల బుచ్చిబాబుగౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు తోడుసు లింగయ్యయాదవ్‌,మండలనాయకులు యానాల ఇంద్రసేనారెడ్డి,కన్నెబోయిన వెంకటభిక్షం, ఎలమకంటి సోమన్న, కమటం శ్రీనివాస్‌,పంది శ్రీనివాస్‌, బుక్క శ్రీనివాస్‌, చిత్తలూరి వెంకటయ్య, మల్లెపాక శ్రీనివాస్‌,మల్లేపాక రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.
మునగాల: మండలంలోని వివిధ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయజెండాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ జవహార్‌లాల్‌, వైస్‌ఎంపీపీ కొలిశెట్టి బుచ్చి పాపయ్య, ఎస్‌ఐ లోకేష్‌యాదవ్‌, సింగిల్‌విండో చైర్మెన్లు తొగరు సీతారాములు, కందిబండ సత్యనారాయణ,వల్లపురెడ్డి రామిరెడ్డి, చందాచంద్రయ్య, మునగాల, కొక్కిరేణి సర్పంచులు చింతకాయల ఉపేందర్‌,కామళ్ళ బుచ్చమ్మ, లిప్టు చైర్మెన్లు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, పోతుగంటి సోమేశ్వరరావు,బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు తొగరు రమేష్‌, వ్యవసాయ అధికారి బాణోత్‌ అనిల్‌కుమార్‌, పాల్గొన్నారు.
తిరుమలగిరి:  మండలకేంద్రంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత సురేందర్‌రావు, మున్సిపల్‌ చైర్మెన్‌ పోతరాజు రజినిరాజశేఖర్‌,జెడ్పీటీసీ దూపటి అంజలి రవీందర్‌, మార్కెట్‌ చైర్మెన్‌ కొమ్మినేని శ్రావంతి సతీష్‌,కౌన్సిలర్లు పాల్గొన్నారు.అదేవిధంగా తిరుమలగిరి మున్సిపల్‌ కేంద్రం కార్యాలయంలో మున్సిపల్‌చైర్‌పర్సన్‌ పోతరాజు రజనీ రాజశేఖర్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలేసి కొబ్బరికాయ కొట్టి జెండా ఆవిష్కరణ గావించారు.అదేవిధంగా కౌన్సిలర్లు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. .అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్‌ దండు శ్రీనివాస్‌, మేనేజర్‌, జూనియర్‌ అసిస్టెంట్స్‌, మెప్మా సిబ్బంది,వార్డు ఆఫీసర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.మండలకేంద్రంలో జాతీయజెండాను బీఎస్పీ మండల అధ్యక్షులు మల్లేపాక కృష్ణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ సభ్యులు దాసరి శ్రీను, తుంగతుర్తి మాజీ అధ్యక్షులు చింతకుంట్ల చింతయ్య, ఉపాధ్యక్షురాలు కమటం శోభాభారు, ప్రధాన కార్యదర్శి రాంబాబు, సోషల్‌ మీడియా తుంగతుర్తి ఇన్‌చార్జి సతీష్‌, బీఎస్పీ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు ఉడుగు సుధాకర్‌, అధ్యక్షులు చెరుకుపల్లి లక్ష్మణ్‌,నాగేశ్వర్‌, వేములలక్ష్మణ్‌, సీహెచ్‌.ఆధిత్య, నాగరాజు, నవీన్‌ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ...పట్టణంలోని చౌరస్తాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎలిసోజు నరేష్‌,ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు కందుకూరు అంబేద్కర్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు గంటా అమరేందర్‌రెడ్డి, గుండెపురి ఎంపీటీసీ ధరావత్‌ జుమ్మిలాల్‌, సర్పంచులు ప్రేమ్‌ప్రసాద్‌,రామోజీ, సహకార బ్యాంకు డైరెక్టర్‌ రంజా,మాజీ జెడ్పీటీసీ కోక్యానాయక్‌, మండల నాయకులు దూపాటి మల్లయ్య, గుగులోతుసుధాకర్‌, దొంగరి రవి, పేరాల వీరేష్‌,కన్నెబోయిన మల్లయ్య, బర్ల సోమ నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని కృష్ణ ,ఎల్లమల నాగరాజు, లకావత్‌ సైదా, యువజనకాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కందుకూరి విశ్వేశ్వర్‌, ఉపాధ్యక్షులు చింతకాయల సుధాకర్‌, పాలబిందెల రవి, జితేందర్‌, మున్సిపాలిటీ 14వ ఇన్‌చార్జి దొంతరబోయిన నర్సింహ, రామ్‌సింగ్‌నాయక్‌, ఎల్లయ్య,నర్సయ్య, బోన్ల వంశీ, రాకేష్‌, వెంకన్న, ఉపేందర్‌, యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.
మద్దిరాల: మండలకేంద్రంలోని వివిధ ప్రభత్వ కార్యాలయాలలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి.పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై నర్సింగ వెంకన్నగౌడ్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌,మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి వికాస్‌పాటిల్‌,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గుడ్ల ఉపేంద్రవెంకన్న,బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఎస్‌ఏ రజాక్‌, కాంగ్రెస్‌ కార్యాలయంలో మండల అధ్యక్షులు ముక్కాల ఆవిలమల్లుయాదవ్‌,ఐకేపీ కార్యాలయంలో లక్ష్మి, మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కార్యాలయంలోనూ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా జెండాలు ఎగురవేసి మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ,వైస్‌ఎంపీపీ శ్రీరామ్‌రెడ్డి,సర్పంచులఫోరం మండల అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వడ్డాణం మధుసూదన్‌,వల్లపు రమేష్‌యాదవ్‌,పాలబిందెల శ్రీనివాస్‌, మధు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ కార్యాలయంలో…మండలకేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్‌ మండలఅధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.భారత జాతీయ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి పచ్చిపాలు వెంకన్నయాదవ్‌,కిసాన్‌సెల్‌ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు బరపటి ఉపేందర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాక అమృతమల్లు, తాళ్లపెళ్లి సురేష్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల యూత్‌ అధ్యక్షులు మామునూరు ఉపేందర్‌గౌడ్‌,ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షులు కూజఎలేష్‌,శ్యామ్‌రెడ్డి, రేసులింగన్న పాల్గొన్నారు.
నూతనకల్‌: మండలకేంద్రంతో పాటు మండలపరిధిలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జమీరుద్దీన్‌,పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఎస్సై వైప్రసాద్‌, పీఏసీఎస్‌ కార్యాలయంలో పీఏసీఎస్‌ చైర్మెన్‌ కనకటి వెంకన్న, బీఆర్‌ఎస్‌ మండల కార్యాలయంలో అధ్యక్షులు మున్న మల్లయ్యయాదవ్‌,సమత పారామెడికల్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగుల్‌మీరా జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అర్వపల్లి: మండలంలోని వివిధ గ్రామపంచాయతీలోను ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయజెండాను ఆవిష్కరించారు.ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నర్సయ్యయాదవ్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ యాదగిరిరెడ్డి, పీఏసీఎస్‌ కార్యాలయంలో కుంట్ల సురేందర్‌ రెడ్డి,ఏఓ శశిధర్‌రెడ్డి, శోభారాణి, సత్యం, పీఏసీఎస్‌ సీఈఓ రామస్వామి,పోలీస్‌స్టేషన్‌లో యాదగిరిరెడ్డి,గుండగాని సోమేశ్‌గౌడ్‌, ఏపీఎం మల్లేష్‌ పాల్గొన్నారు.
అనంతగిరి: ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చండూరి వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో రాష్ట్ర ప్రగతిలో సబ్బండ వర్ణాలు మమేకమవుతూ, దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
చింతలపాలెం: మండలవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పోలీసుస్టేషన్‌లో ఎస్సై కృష్ణారెడ్డి, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వాజిద్‌అలీ, వ్యవసాయ కార్యాలయంలో ఏఈఓ రియాజ్‌, ప్రాథమిక సహకార సంఘంలో చైర్మెన్‌ రంగాచారి జాతీయజెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మండల ప్రజా పరిషత్‌ అధికారి జోగు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.