– బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ
నవ తెలంగాణ- రాయపోల్
తెలంగాణ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాలు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సుదీర్ఘ పోరాటాలతోటి తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగ నిలిపిన ఘనత కెసిఆర్ ది అన్నారు.10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమయిందన్నారు.420 అబద్ధాల హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్, సీనియర్ నాయకులు బాగిరెడ్డి, మంజూరు, ఆస్పత్రి సూపర్వైజర్ శ్రీనివాస్, సిబ్బంది మంజు, నీరజ, వెంకటేష్, ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు మురళి, రాజు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.