కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి

– దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
నవతెలంగాణ – రాయపోల్
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని మార్పు కోసమే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్డం జరిగిందని  దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో మామిడి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.వారి సమక్షంలో బేగంపేట మాజీ సర్పంచ్ తీగుళ్ల లచ్చయ్య తోపాటు పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే వచ్చే వాన కాలంలో వడ్లకు రూ.500 లు బోనస్ ఇస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలో అమలు చేశామని మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో లేని టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎందుకు పనికి రాకుండా పోతుందన్నారు. అబద్దాలతో మాయమాటలు చెబుతున్న బిజెపికి ఓటు వేస్తే వృధా అవుతుందని తెలిపారు. చేతి గుర్తుకు ఓటు వేసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తప్పేట సుధాకర్, ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డి, చేగుంట ఎంపీపీ శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ కనకయ్య, నాయకులు రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్, మండల అధికార ప్రతినిధి కృష్ణ గౌడ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.