
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని పిఎసిఎస్ చైర్మన్ కన్న య్య గారి హరి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం గుడికందుల గ్రామంలోని భైరవ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా నష్టపోయిందని అన్నారు. రాష్ట్ర సాధనకోసం మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్య మం ఉదృతంగా సాగిందన్నారు. కుల మతాలకు అతీతంగా, చిన్న పెద్ద తేడాలేకుండా సమిష్టి కృషి తో తెలంగాణ రాష్ట్ర కల సహకారం అయిందన్నా రు. దేశంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాలలో ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, వెంకట్రామిరెడ్డి ని, కారు గుర్తు కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారం ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ దూలం బైరా గౌడ్, చింత బైరా రెడ్డి, విద్యాకమిటి మాజీ చైర్మన్ గంగని గళ్ళ బాల్ రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.