పేదల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం 

Development of the poor is the government's objective

– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 

నవతెలంగాణ – నెల్లికుదురు 
పేద ప్రజల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు మండల కేంద్రంలో స్వచ్ఛ ధనం  పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను బ్రతికించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మొక్కలు పెద్దదై వృక్షం రూపంలో ఎదిగిన తర్వాత కార్బన్డయాక్సైడ్ ను తీసుకొని మనకు కావాల్సిన ఆక్సిజన్ అందించేది వృక్షమని అన్నారు. అంతే కాకుండా కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. మానవ మొనగాడా కు ఎంతగానో మొక్కలు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినప్పటికీ కొన్ని నెలలు ఎన్నికల కోడ్ అని కొంతకాలం పోగా ఉన్న కొత్త కలంలో పేద ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి గ్రామ స్థాయిలో తీసుకెళ్లి పేద ప్రజల కోసం నిరంతర కృషి చేస్తుందని అన్నారు. ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు వారిని శుభ్రపరచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నీటి నిల్వ ఉన్నట్లయితే అక్కడ దోమ ఎక్కువ తయారయి అది మనకు కుట్టినట్లయితే వాటి ద్వారా మలేరియా టైఫాయిడ్ డెంగు విష జ్వరం విరోచనాలు వాంతులు వచ్చి అనారోగ్య సమస్యతో బాధపడతామని అన్నారు. అలా ప్రజలు బాధపడకుండా గ్రామపంచాయతీ పరిధిలో అధికారులు ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా గ్రామాలలో చెత్తాచెదారం లేకుండా నీటి నిలువలు లేకుండా శుభ్రపరిచే విధంగా కృషి చేయాలని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని వర్షానికి సైతం లెక్కచేయకుండా అధికారులు అందరూ హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందించారు. అనంతరం విద్యుత్ శాఖ పొలంబడి కార్యక్రమంలో విద్యుత్ ఏడి ఆపరేటివ్ తో కలిసి విద్యుత్ శాఖ తరపున చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని రైతాంగానికి తెలియజేసే కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మరియన్న. తాసిల్దార్ కోడి చింతల రాజు ఎంపీడీవో బాలరాజు ఎంపీ ఓ పద్మ కులు సత్యపాల్ రెడ్డి యాదవ రెడ్డి హెచ్ వెంకటేశ్వర్లు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ కాసం లక్ష్మారెడ్డి బాలాజీ నాయక్ రాజేష్ క్రాంతి పులి వెంకన్న శ్రీశైలం వారి పల్లి పూర్ణ మౌనేందర్ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు మరియు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.