రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వం తోనే సాధ్యం

– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-ఖానాపురం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రజలకు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉందని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన మండలంలోని మంగళవారి పేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి శనివారం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి  చేరాయి. పార్టీలో చేరిన వారిని పెద్ది కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో- చెన్నబోయిన లింగయ్య,బత్తుల శ్రీను, బుర్క సారయ్య, కన్నెబొయిన రాజశేఖర్, పిల్లల కుమారస్వామి, నిరటి సారయ్య, వల్లమాల గణేష్ వర్మ లు ఉన్నారు. ఆయన వెంట ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, గ్రామ సర్పంచ్ లావుడ్య రమేష్, గొంది నాగేశ్వరరావు,క్లస్టర్ భాద్యులు, సొసైటీ డైరెక్టర్,  తదితరులు ఉన్నారు.