దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి

నవతెలంగాణ-భిక్కనూర్
దాతల సహకారంతో ఆలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధిరాములు తెలిపారు. మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి సిద్దిపేట జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన మాధవి లతా సుధాకర్ రెడ్డి దంపతులు ఆలయ అభివృద్ధికి తమ వంతుగా10,111 రూపాయలు విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధిరాములుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల పోరం అధ్యక్షులు సాయి రెడ్డి, నాయకులు అంజ గౌడ్, నరసారెడ్డి, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.