కాంగ్రెస్‌ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి

– మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి
– కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్‌ ధరావత్‌ కైలా, స్వామినాయక్‌
నవతెలంగాణ-కోదాడరూరల్‌
కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ పరిధిలోని బాలాజీ నగర్‌ లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైదా నాయక్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 7వా వార్డు కౌన్సిలర్‌ ధరావత్‌ కైలా స్వామి నాయక్‌ వారి అనుచరులకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ పార్టీ గిరిజనులను మోసం చేసింది అన్నారు. కేవలం ఓట్ల కోసమే అధికార పార్టీ రాజకీయం చేస్తుంది తప్ప గిరిజనుల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదన్నారు. దారి పొడవునా గిరిజనులు ఘన స్వాగతం పలుకుతూడీజే మోతలతో గిరిజన సంప్రదాయ నత్యాలతో ఆటపాటలతో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో సైదా నాయక్‌,పీసీసీ డెలిగేట్‌ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్‌ పారా సీతయ్య, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు,వంటి పులి వెంకటేష్‌, శంకర్‌ నాయక్‌, రామిశెట్టి. హరిప్రసాద్‌, బిక్షం, వాల్యా నాయక్‌, రాజు నాయక్‌, రవి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.