– కాటాపూర్, బీరెల్లి ఎంపిటిసి పరిధి కమిటీలు ఏర్పాటు
నవతెలంగాణ -తాడ్వాయి
బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు, ఆత్మ మాజీ చైర్మన్ దుర్గం రమణయ్య, మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్లు కాక లింగయ్య, రేగ నరసయ్యలు అన్నారు. బుధవారం టిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు మండలంలోని కాటాపూర్, బీరెల్లి గ్రామాల ఎంపిటిసి పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ హాయంలోనే మండలంలోని కాటాపూర్, బీరెల్లి, రంగాపూర్ గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. మిషన్ కాకతీయతో అన్నారం పెద్ద చెరువు, పంబాపూర్ చెరువు, బీరెల్లి చెరువు, నర్సాపూర్ చెరువు ల అభివృద్ధి జరిగిందన్నారు. కాటాపూర్ లో సబ్స్టేషన్ ఏర్పాటు, సబ్ స్టేషన్ ఏర్పాటు, నిరు పేదలకు ఇంటి స్థలాలపంపిణీ, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ జరిగిందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. గ్రామాల్లో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. అనంతరం కాటాపూర్ ఎంపీటీసీ పరిధి బీఆర్ఎస్ సమన్వయ కమిటీ లో దొడ్డి రంజిత్, దానక నర్సింగారావు, తడక సాయి, ఎస్ డి వహీద్, ఇందారపు లాలయ్య, మైపతి లక్ష్మీ నర్సయ్య, సాయిరి లక్ష్మీ నర్సయ్య, అప్పాజీ రతన్, తాటి శ్రీను ,ఇటికారి కృష్ణ, బీరెల్లి ఎంపీటీసీ పరిధిలో సమన్వయ కమిటీ సభ్యులు గా బాసాని రామకృష్ణ, నూశెట్టి రాము, బక్క శ్రీను, మెస్సు శ్రీను, పెనక విశ్వనాథం, బాడిష శంకర్, ఇర్ప విష్ణు, ఇర్ప ప్రసాద్ సభ్యులతో కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాసరెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, సీనియర్ నాయకులు ముండ్రాతి రాజమౌళి, మండల సమన్వయ కమిటీ సభ్యులు గోపెన బోయిన కొమరయ్య, జీడి బాబు,పాయం నరసింహారావు, కొండూరి నరేష్, మాజీ మండల అధ్యక్షులు నూశెట్టి రమేష్, రంగు సత్యం, మాజీ సర్పంచులు పుల్లూరి గౌరమ్మ, పులి పెద్ద నరసయ్య గౌడ్, మేడిశెట్టి నరసింహయ్య, మేడిశెట్టి మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ వహీద్, మాజీ మండల కో ఆప్షన్ మెంబెర్ దిల్వర్ ఖాన్, ఇందారపు లాలయ్య, బందెల తిరుపతి, పాలకుర్తి బాబు,పల్లేర్ల మహేశ్వర చారి, లంజపెళ్లి వెంకటేష్, దిడ్డి సూర్య తదితరులు పాల్గొన్నారు.