గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్
గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అని, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రే వెంకటయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో బుధవారం, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కర్రే బీరు మల్లయ్య ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలతో పిట్టలగూడెం ఎస్సీ కాలనీ లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పార్టీ అధ్యక్షులు కర్రే వెంకటయ్య, మల్లపురం బీఆర్ఎస్ పార్టీఇంచార్జ్ దాతరపల్లి ఎంపీటీసీ కల్నె ఐలయ్య పాల్గొని, మాట్లాడుతూ కెసిఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలన్నీ గడపగడప తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ ఆలేరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీ తో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కారింగుల కిష్టయ్య, చల్లూరి స్వామి, కర్రె సత్తయ్య, ఒగ్గు బిక్షపతి, గోపి ఎల్లయ్య, గోపి కృష్ణ స్వామి, గుజరాతి రాము, కృష్ణారెడ్డి, మాధవరెడ్డి, మధు, రాజు, రమేష్, శ్రీకాంత్, శ్రీశైలం శేఖర్, రాజు, మల్లేష్, శ్రీనివాస్, సత్యనారాయణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.