గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

– పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నవతెలంగాణ –  యాదగిరిగుట్ట రూరల్
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి క్లస్టర్ రైతు వేదిక, గ్రామపంచాయతీ భవన వ్యాపార సముదాయంలను బీర్ల ఐలయ్య ప్రారంభించారు. అంగన్వాడి భవన నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. చిన్న కందుకూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం, రజక సంఘ భవనం, సీసీ కెమెరాలను ప్రారంభించారు. బహుపేట లో రెండు సిసి రోడ్లకు శంకుస్థాపన అనంతరం స్వామి వివేకానంద ఆర్చ్ ప్రారంబించారు. తాళ్ల గూడెం గ్రామంలో గౌడ సంఘం భవనం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ లతోపాటు, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తాను అన్నారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఒక్కొక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, చిన్న కందుకూరు గ్రామంలో అన్ని పార్టీలు, యువకులు సీసీ కెమెరాల ఏర్పాటును అభినందించారు. ఈ కార్యక్రమం లో వంగపల్లి గ్రామ సర్పంచ్ కానుగ కవితబాలరాజు, చిన్న కందుకూరు సర్పంచ్ నమిలే రాజ్యలక్ష్మి రాంచందర్, బహుపేట సర్పంచ్ పద్మ, తాళ్ల గూడెం సర్పంచ్ ఈదులకంటి భాస్కర్, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు ఎంపీపీ అశోక్, ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మోత్కుపల్లి జ్యోతి, ఎంపిటిసి రేపాక మౌనిక మహేందర్, ఎంపిటిసి కొక్కలకొండ అరుణ, ఉప సర్పంచ్ రేపాక స్వామి, రామజిపేట సర్పంచ్ మొగిలిపాక తిరుమల రమేష్ , జిల్లా వ్యవసాయ అధికారి  కె.అనురాధ, వ్యవసాయ సంచాలకులు డి.పద్మావతి, మండల వ్యవసాయ అధికారి  కె.రాజేష్ కుమార్, ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి , సిఐ రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారి లావణ్య, బండపల్లి స్వామి గౌడ్, మోటే శంకర్ తదితరులు పాల్గొన్నారు.