గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

– ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-నవాబుపేట్‌
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పను లకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకుస్థాపన ప్రారం భించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీ ఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికీ ఏదో విధం గా సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతు న్నాయన్నారు. గొల్లగుడలో సీసీరోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ నిర్మాణానికి రూ.20 లక్షలు గంగ్యడా లో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి రూ.20 లక్షలు. ఆరోగ్య ఉపకేంద్రం రూ.20 లక్షలు. సీసీరోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ నిర్మాణానికి రూ.40 లక్షలు నరేగుడా బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1 కోటి 42 లక్షలు సీసీరోడ్ల నిర్మాణానికి రూ.55 లక్షలు. అక్నాపూర్‌లో మూసీ నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.5 కోట్లు. సీసీరోడ్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు. మైతబాన్‌ గుడాలో అండర్‌ డర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ నిర్మాణానికి రూ. 20 లక్షలు సీసీరోడ్ల నిర్మాణా నికి రూ.20 లక్షలు, అత్తాపూర్‌లో రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ నిర్మాణానికి మంజూ రయ్యాయి. లింగంపల్లిలో రూ.2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం. రూ.10 లక్షలతో అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజ్‌. 80 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి మంజురయ్యాయి. కార్యక్రమానికి మండల, ఏఎంసీ చైర్మన్‌ ప్రశాంత్‌ గౌడ్‌, డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు పోలీస్‌ రామ్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రావు గారి వెంకట్‌ రెడ్డి, సర్పంచులు స్వరూప భీమయ్య, అనిత రం గారెడ్డి, అజరు కుమార్‌, పరమయ్య, శ్రీనివాస్‌ గౌడ్‌, నర్సింలు, సుధాకర్‌ రెడ్డి, ఎంపీటీసీలు దయాకర్‌ రెడ్డ సు మలత మాణిక్‌ రెడ్డి నాయకులు, మండల డీఈ మాధ వరెడ్డి, ఏఈ లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శులు నాయ కులు పాల్గొన్నారు.