గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం దశల వారిగా గ్రామాల అభివృద్ధి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌
నవతెలంగాణ-కోట్‌పల్లి
గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్‌ ఎమ్మెల్యే, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. గురువారం కోట్‌పల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. బీరెల్లి గ్రామంలో నూతనంగా వేసిన రూ. 17 లక్షల 50 వేలు సీసీ రోడ్డు పనులను, , రూ. 72 లక్షలతో వేసిన రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. నాసన్‌పల్లిలో రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులు, , రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాసన్‌పల్లి తండాలో రూ. 5 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మోత్కుపల్లిలో మన ఊరు మన బడిలో భాగంగా జిల్లా పరిషత్‌ పాఠశాలలో రూ. 65 లక్షల 14 వేలు నిధులతో నిర్మించిన మౌలిక సదుపాయాలను, మైనారిటి స్మశాన వాటిక ప్రహరి గోడ రూ. 5 లక్షలు, సీసీ రోడ్లు రూ.20 లక్షలు, మన ఊరు మన బడిలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో 31 లక్షల 41 వేల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. బార్వాద్‌ తండాలో నూతన సీసీ రోడ్లు 20 లక్షలు, గ్రామ పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన 20 లక్షలు, అండర్‌ డ్రైనేజీ 2 లక్షల 50 వేలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. బార్వాద్‌ గ్రామంలో మన ఊరు మన బడి కోసం 59 లక్షల 67 వేల నిధులతో శంకుస్థాపన చేశారు. 55 లక్షల నిధులతో వేసిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఎన్కెపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్లు రూ.15 లక్షలతో అండర్‌ డ్రయినేజీ పనులు 5 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకుముందు బార్వాద్‌ మోత్కుపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వికారాబాద్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాలే అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని గ్రామాలు అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ప్రతి కుటుంబానికి ఏదో విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేకూరుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందుతున్నాయని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికలలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి మల్ల ఉమాదేవి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుందరి అనిల్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బార్వాద్‌ సర్పంచ్‌ వెంకటేష్‌ యాదవ్‌, మోత్కుపల్లి సర్పంచ్‌ పాండురంగారెడ్డి, నాసన్‌పల్లి సర్పంచ్‌ పద్మ నాగిరెడ్డి, బీరోల్‌ సర్పంచ్‌ సూర్య కళ మాణిక్యం, బార్వాద్‌ తాండ సర్పంచ్‌ చవాన్‌ కవిత మోహన్‌ సింగ్‌, ఎన్కెపల్లి సర్పంచ్‌ భారతమ్మ ప్రభాకర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంచందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ దశరథ్‌ గౌడ్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు సాయన్న, ఉప సర్పంచ్‌ సంగారెడ్డి, మాజీ సర్పంచ్‌ నర్సింహారెడ్డి, నాయకులు మహేందర్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, మైనో దిన్‌, గౌరిశంకర్‌, ఆశ్వీన్‌ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.