– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కగూడ, కర్ణంగూడ, చెర్లపటేల్‌గూడ గ్రామాల్లో రూ.1.15కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధి చెందాయంటే సీఎం కేసీఆర్ చొరవతోనేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ పి.కృపేష్, జడ్పీటీసీ భూపతిగళ్ల మహిపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, సర్పంచులు కత్తుల పవిత్ర కుమార్, వంగేటి కవితరాంరెడ్డి, కంబాలపల్లి గీతారాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి , మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఏనుగు బుచ్చి రెడ్డి, నాయకులు మంద సురేష్, జిర్కోని రాజు పాల్గొన్నారు.