ప్రజా పాలనలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రతినిధి
– పలు గ్రామాల్లో రూ.64లక్షల 80వేల
– అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలనలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. నాగన్‌పల్లి, పోల్కంపల్లి, రాయపోల్‌, ముకునూర్‌, దండుమైలారం గ్రామాల్లో రూ.64లక్షల80వేల విలువ చేసే పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నాగన్‌పల్లిలో రూ.10లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రయినేజీ, పోల్కంపల్లిలో రూ.15లక్షలతో చేపట్టిన డ్రయినేజీ, సీసీరోడ్లు, రాయపోల్‌లో రూ.14లక్షలతో చేపట్టిన అంగన్‌వాడీ భవనం, సీసీరోడ్లు, ముకునూర్‌లో రూ.19లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనం, దండుమైలారంలో రూ.4లక్షల 30వేలతో నిర్మించిన సీసీరోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు రవాణా వసతి కల్పించామన్నారు. రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పారు. మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే మరో రెండు గ్యారంటీలను అమలు చేయనున్నామన్నారు. రుణమాఫీ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దశల వారీగా గ్రామాలను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పి కృపేష్‌, జెడ్పీటీసీ భూపతిగళ్ల మహిపాల్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు జగన్‌, ఆండాలు, బల్వంత్‌రెడ్డి, శివరాల జ్యోతి, రవనమోని మల్లీశ్వరి జంగయ్య, ఎంపీటీసీలు చెరుకూరి మంగరవీందర్‌, జ్యోతిబల్వంత్‌రెడ్డి, ఆరుణ, ఆనసూయ, ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ లక్‌పతి, ఏఈ ఇంద్రసేనారెడ్డి తదితరులున్నారు.