నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని పిఎసిఎస్ డైరెక్టర్, యాదగిరిగుట్ట మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఏలేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట మాసాయిపేట లో ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ను విమర్శించే స్థాయి కర్రె వెంకటయ్యకు లేదని, స్థాయిని మరచి విమర్శలు చేయడం తగదని, నోరు అదుపులో పెట్టుకోవాలని, బేషరతుగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో సంక్షేమం అభివృద్ధిలో ముందంజలో ఉందని, సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేక బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మల్లాపురంలో మెడికల్ కాలేజ్ నిర్మించే బాధ్యత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీర్ల ఐలయ్య తీసుకున్నారని అన్నారు. వంగపల్లి లో అండర్ పాస్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.