‘కాంగ్రెస్‌తోనే మహిళల అభివద్ధి సాధ్యం’

నవతెలంగాణ-చేవెళ్ల
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితేనే మహిళల అభివద్ధి సాధ్యమని కాంగ్రెస్‌ శ్రేణులు పేర్కొంది. మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని సింగప్పగూడ, న్యాలట, ఖానాపూర్‌ గ్రామాలలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామైన భీంభరత్‌ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటింటికీ తిరిగి మహిళలను ఓటు హస్తం గుర్తుకు ఓటు వేసి భీం భరత్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తుందన్నారు. మహాలక్ష్మీ పథకంతో మహిళలకు నెలకు రూ.2500, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతు భరోసాతో రైతుకు ఎకరాకు ఏటా రూ. 15వేలు, కౌలు రైతులకు వర్తింపు, రైతు కూలీకి ఏటా రూ. 12వేలు వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌, చేయూత, నెలకు రూ. 4వేల ఫించన్‌, రూ. 10లక్షల ఆరోగ్యబీమా, యువ వికాసంతో కళాశాల విద్యార్థులకు రూ. 5లక్షల సహాయం, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు, ఉద్యమ కారులకు 250 గజాల స్థలం, గృహాజ్యోతి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పని చేయాలని కోరారు. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నెల రోజులు కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడితే ప్రజలకు, రైతులకు, నాయకులకు ఎంతోమేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజా ఆగిరెడ్డి, పీఎసీఎస్‌ చైర్మన్లు దేవర వెంకట్‌రెడ్డి, గోనె ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పడాల రాములు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు వీరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డిశెట్టి మధుసూదన్‌గుప్తా, మాజీ సర్పంచ్‌లు దవల్‌ గారి గోపాల్‌ రెడ్డి, పడాల ప్రభాకర్‌, నర్సింలు, మాజీ ఎంపీటీసీ నరసింహరెడ్డి, పెంటయ్య గౌడ్‌, చేవెళ్ల ఉప సర్పంచ్‌ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్‌ టేకులపల్లి శ్రీనివాస్‌, మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జూకన్నగారి శ్రీకాంత్‌ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు దేవర సమతారెడ్డి, మహిళా మండల ప్రధాన కార్యదర్శి సరిత, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్‌, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు బండారి వెంకట్‌ రెడ్డి, పీఎసీఎస్‌ డైరెక్టర్‌ పైండ్ల మధుసూదన్‌ రెడ్డి, నాయకులు దుర్గ ప్రసాద్‌, ప్రభాకర్‌, పాండు, గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు
24 25