అభివృద్ధికి అవకాశం ఇవ్వాలి.. పెద్దికే పట్టం కట్టాలి..!

– నియోజకవర్గం అభివృద్ధి ప్రచారహస్రం

– అన్ని వర్గాలకు అండగా బిఆర్ఎస్ మ్యానిఫెస్టో
– మండల టిఆర్ఎస్ నాయకులు మహాలక్ష్మి వెంకట రామ నరసయ్య
నవతెలంగాణ-ఖానాపురం
మండల అభివృద్ధికి కృషి చేసి, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డికి మండల ప్రజలు మద్దతు తెలిపి రానున్న ఎన్నికలలో అధిక మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట రామ నరసయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మండలంలోని బుధరావు పేట,వేపచెట్టు తండా,భద్రు తండా గ్రామాలలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు. మండలంలో ఉన్న పల్లె, తండా, గుడాలు ఏకం అయి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత నాయకులు చేయలేని అభివృద్ధి ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో చేసి చూపించారని అన్నారు. మారు మూల తండాలలో మొదలుకొని మేజర్ గ్రామపంచాయతీ ల వరకు కావలసిన సిసి రోడ్లను, బీటీ రోడ్లను లింకేజీ రోడ్లను మంజూరు చేసి పల్లె పల్లెలను కలుపుకొని ప్రజలకు ప్రయాణం సులువుతరం చేసిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి అని అన్నారు.అరకొరక ధరలతో ఉన్న పంట భూములను గోదారి జలాలను పాకాలకు తరలించి భూముల ధరలకు రెక్కలు వచ్చేటట్లు చేసిన అభివృద్ధి పదాత పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రతి కుటుంబానికి ఫలాలు అందేలా కృషిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డికి మండల ప్రజలందరూ సహకరించి ఓటు వేసి అభివృద్ధి కొనసాగే విధంగా మద్దతు తెలిపాలని కోరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రచారహస్రంలా మార్చుకొని ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తూ ఇంటింటికి తెలియపరచాలని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు అనుగుణంగా ఉందని తెలిపారు. ప్రజలతోనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని మండలవాసులు అధిక మెజార్టీ ఇచ్చి అగ్రస్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్,ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు మండల కన్వీనర్ కుంచారపు వెంకట్ రెడ్డి,మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ సదర్ లాల్,సర్పంచులు కాస ప్రవీణ్ కుమార్, భూక్య పద్మా వెంకన్న, ప్రజా ప్రతినిధులు, గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.