– దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-డిండి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివద్ధి చెందారని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం డిండి మండలం దాసరినేమిలిపూర్ తండా, దాసరినేమిలిపూర్ గ్రామానికి చెందిన 60 మంది, కందుకూరు గ్రామానికి చెందిన పలువురు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే తండాల రూపురేఖలు మారాయని తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన తండాల తలరాతలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించేందుకు వస్తున్న ప్రతిపక్ష పార్టీలను ప్రజలు తిప్పి కొట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్‌రావు, రైతు బంధు అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్‌రావు, బీఆర్‌ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు మాల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, అవిరినేని గోపాల్‌రావు, వెంకటయ్య, భగవంతురావు, ఎంపీటీసీ ఉప్పుగంటి శ్రీదేవిప్రశాంత్ రావు, సర్పంచ్ నర్సింహా, రాంరెడ్డి, బొడ్డుపల్లి సంజీవ, సూరి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.