నా హయంలో నిజామాబాద్ లో డెవలప్మెంట్ పనులు జరిగాయి..

Development works were done in Nizamabad during my reign..– పది సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి పనులు 
– కమిట్మెంట్ తో పనిచేసి నిజామాబాద్ ని సుందరి కరంగా చేశాం 
– మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగల 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తా హయాంలో నగరంలో డెవలప్మెంట్ పనులు బాగానే జరిగాయని పది సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి పనులు చేశామని, కమిట్మెంట్తో పనిచేసే నగరాన్ని సుందరీకరంగా చేశామని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విజయలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన నగర మేయర్ దండు నీతూ కిరణ్ మరియు కార్పొరేటర్ల పదవి కాలం ముగియడంతో వారికి నిర్వహించిన ఆత్మీయ అభినందన సభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు  గణేష్ బిగాల హాజరై మాట్లాడారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం.ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనా విపత్తును సైతం ఎదురుకోవడం జరిగింది.నిజామాబాద్ నగరంలో కమిట్మెంట్తో పనిచేసి నిజామాబాద్ ని అభివృద్ధి పథంలో ఉండే విధంగా చూశాం.గెలిచిన కొత్తలో మున్సిపల్ 13 కోట్లతో విద్యుత్ బకాయాలను కట్టి జీరో చేయడం జరిగిందని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించి నిజామాబాద్ కి వన్నెతెచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్నిది. నగరంలో ఎక్కడ లేని విధంగా మినీ ట్యాంక్బండ్, ఐటీ హబ్ , వైకుంఠధామాలు, అర్బన్ పార్కులు,సెంటర్ మీడియన్స్ లైటింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మిస్టర్ డెవలప్మెంట్ అని నన్ను పిలిచేవారు అని తెలిపారు. ఎవరు చెప్పినా వినకుండా అండర్ గ్రౌండ్ పనులను పూర్తి చేసి విజయవంతంగా అందరికీ చూపించడం జరిగింది. 60 డివిజన్లో సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు అందించడం జరిగింది.పదవి కాలం ముగుయడం అంటే అంటే అయిపోయిందని కాదు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు ప్రజా ఆశీర్వాదం తో గెలిచి మళ్ళీ అభివృద్ధిలో ముందుండాలని అన్నారు. అనంతరం ప్రతి కార్పొరేటర్కు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్తో కుమార్పాటు కార్పోరేటర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.