అటవీ గిరిజన ప్రాంతాల్లో ముమ్మరంగా సాగుతున్న అభివృద్ధి పనులు..

Development works are going on in forest tribal areas.– గవర్నర్ జిష్ణు దేవ్ దత్తత తీసుకున్న గ్రామంలో వేగంగా అభివృద్ధి పనులు 
– ఈనెల 24న గవర్నర్, మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు 
నవతెలంగాణ – తాడ్వాయి 
ఒకప్పుడు ఎవరికీ పట్టని గ్రామం. ఇప్పటికీ గ్రామానికి చేరుకోవడానికి సరైన దారిలేని దైన్యం. ఇది గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తి పరిస్థితి. నిజంగా స్థానిక ఆదివాసీలకు ఒక వరం లాంటిదే. ఈనెల 24న గవర్నర్ రాకతోనైనా కొండపర్తి గ్రామం దశ మారుతుందనే ఆశతో ఆయనకు స్వాగతం పలికేందుకు అక్కడి కొండపర్తి సంసిద్ధలవుతున్నారు. ఆదివాసీలు నివసిస్తున్న కుగ్రామమది. గత సంవత్సరం ఆగస్టు 31న తలెత్తిన ప్రకృతి విపత్తుకు ఆ ప్రాంతంలో అడవి వృక్షాలతో పాటు, పూర్తిగా ఇండ్లు కూలిపోయి ఆ గ్రామంలో కూడా తీవ్రంగా నష్టం జరిగింది. అభివృద్ధికి దూరంగా ఉన్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి కు గ్రామాన్ని, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క సహకారం తో  గవర్నర్ దత్తత తీసుకున్నారు. దీంతో అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా పాలన అధికారి కలెక్టర్ తో పాటు, ఐటీడీఏ పీవో, అధికారులు గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కార్యచరణ ప్రారంభించారు.
గ్రామ సమస్యలపై సర్వే ..
గవర్నర్ విష్ణు దేవ్ దత్తత తీసుకోవడంతో అధికారులు ఆ గ్రామం పై దృష్టి మరల్చారు. గవర్నర్ కార్యాలయం సిబ్బంది ఇటీవల గ్రామానికి వచ్చి స్థానిక అధికారులతో కలిసి సమగ్ర సర్వే నిర్వహించారు. 324 మంది జనాభా ఉండగా, 68 కుటుంబాలు ఉన్నాయి. 185 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో సరైన రథాలు లేవు మురుగునీటి కాలువల నిర్మాణం జరగలేదు. జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ గ్రామానికి రవాణా మార్గం సరిగా లేదు. విద్యా వైద్యం ఉపాధి వ్యవసాయం మహిళా సాధికారత తదితర సమస్యలన్నీటిని అధికారులు గుర్తించారు.
రెండు కమిటీ భవనాల నిర్మాణం ..
అధికార యంత్రాంగం ఇప్పటికే కార్య చరణ ప్రారంభించి. ఈనెల 24న గవర్నర్ విష్ణు దేవ్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ల చేతుల మీదగా ప్రారంభం ఉంది. కనుక పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 70 లక్షలతో రెండు కమ్యూనిటీ భవన నిర్మాణాలు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిలో గ్రామంలోని మహిళలు పురుషులకు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వనున్నారు. విస్తరాకుల తయారీ, టైలరింగ్, అల్లికలు, శానిటరీ వస్తువులు, మసాలాలు తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామంలో 68 లక్షలు వెచ్చించి రెడ్కో సంస్థ నుంచి ప్రతి ఇంట్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. గ్రామంలో అందరికీ 64 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నారు. గ్రామంలో అన్ని వీధులలో సిమెంట్ రోడ్లు, మురుగునీరు కాలువలు నిర్మాణం చేపట్టానన్నారు.