ఎంపీటీసీ నిధులతో గ్రామాలకు అభివృద్ధి పనులు…

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండల పరిషత్ నిధుల నుండి నేలపట్ల ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ నేత ఆధ్వర్యంలో శుక్ర వారం ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ,పద్మ శాలి స్మశాన వాటికకు వాటర్ ట్యాంక్ నిర్మాణంకు నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి తడక పారిజాతమోహన్ నేత మాట్లాడు తూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పు డు ప్రజలతో చర్చించి పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఎంపిటిసిలకు నిధులు కేటాయిం చాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ సెక్రటరీ బ్రాహ్మనీ మాజీ సర్పంచ్ తడక రామాంజనేయులు మాజీ ఉపసర్పంచులు తడక వెంకటేశం, పాలమాకుల యాదయ్య మాజీ వార్డు మెంబర్లు గంజి లింగేషా,గంగాపురం నాగేష్ పద్మశాలి కుల సంఘం అధ్యక్షు లు తడక శ్రీనివాసు గ్రామ పెద్దలు కోడం రాములు, బుట్టి కృష్ణ, పాలమాకుల నరసింహ, తడక కోటేశ్వర్, గుర్రం శ్రీనివాసు, యనమల సంజీవ, బూడిద లింగ స్వామి, బూడిద సాయికుమార్, తడక చంద్రశేఖర్, గుర్రం నరసింహ తదితరులు పాల్గొన్నా రు.