
ప్రగతి నగర్ దేవి థియేటర్ వద్ద గల తమ్మల్ల తోట స్మశాన వాటిక అభివృద్ది పనులను తిరిగి మొదలు పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కి వినతి పత్రం కమిటీ సభ్యులు కలిసి బుధవారం ఇచ్చారు. గత ప్రభుత్వం తమ్మల్ల తోట స్మశాన వాటిక అభివృద్ది కొరకు దాదాపు రూ.4 కోట్ల రూపాయలతో ప్రణాళికలు చేసి, పనులు కూడ మొదలు పెట్టి ఎన్నికల కోడ్ రావడంతో పనులను నిలిపి వేసారని, కమిటీ అధ్యక్షులు నరాల సుధాకర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్బాల్ సూర్యనారాయణ ని కలిసి వినతి పత్రం అందజేసారు. అంతిమ సంస్కారానికి వచ్చే ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నందున ఆగిపోయిన అభివృద్ది పనులను త్వరితగతిన మొదలు పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ని కమిటీ సభ్యులు కోరడం జరిగింది. తగు చర్యలు తూసుకుంటాని హామి ఇచ్చిన అర్బన్ ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలిపిన కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరాల సుధాకర్, పులి జైపాల్, కొయ్యాడ శంకర్, అరుణ్, అంజన్న తదితరులు పాల్గొన్నారు.