అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలి

– నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్
నవతెలంగాణ కంటేశ్వర్: నగరంలోని 26, 46, 48 డివిజన్ల పరిధిలో 5.5లక్షల నిధులతో చేపట్టే కల్వర్టు పనులను నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ.. నగరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ప్రారంభించిన పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ల కార్పొరేటర్లు వనిత, అక్బర్ హుస్సేన్, నాయకులు అరుణ్, రాము ఇంజినీర్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.