గోషామహల్ నియోజకవర్గ అభి వృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతు న్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు . గన్ ఫౌండ్రి డివిజన్ సుల్తాన్ బజార్ కందస్వామి లేన్ లోసుమారు రూ.70 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ ,పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాజెపి పార్టీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓంప్ర కాష్ బిశ్వ, నేతలు జ్ఞానేశ్వర్, దీపక్,సైలేందర్, శ్యామ పాటు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.