
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి అనుబంధ కమిటీ అయిన రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ , సీనియర్ న్యాయవాది రేగుల దేవేందర్ నియామకం అయ్యారు.ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం (టి యూ డబ్ల్యూ జే ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా రేగుల దేవేందర్ పేరును ప్రతిపాదించగా,రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీకి కమిటీ సభ్యులకు రేగుల దేవేందర్ ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.రేగుల దేవేందర్ నియామకం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి దేవేందర్, కార్యదర్శి ముత్యం, కోశాధికారి గంగు సతీష్, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేష్ , ఉపాధ్యక్షులు తాళ్లపల్లి ప్రశాంత్, దూలం సంపత్, మద్దిరాల నరేష్, జర్నలిస్టు కలీం పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.