డెవిల్‌.. పీరియడ్‌ స్పై థ్రిల్లర్‌

Kalyan Ramకల్యాణ్‌రామ్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘డెవిల్‌’. ద బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. నవంబర్‌ 24న ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి సర్వత్రా మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అంచనాలు పెంచేసింది టీజర్‌. అలాగే మాళవిక నాయర్‌, ఎల్నాజ్‌ నరౌజి పోస్టర్లు సైతం అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. ఇక లేటెస్ట్‌గా దసరా శుభసందర్భంగా అభిమానులను స్పెషల్‌ పోస్టర్‌తో విష్‌ చేశారు కల్యాణ్‌రామ్‌. ఈ తాజా దసరా పోస్టర్‌లో కల్యాణ్‌రామ్‌ డైనమిక్‌గా కనిపిస్తున్నారు. పార్టీకి రెడీ అయినట్టు స్పెషల్‌ టుక్సెడోలో అదుర్స్‌ అనిపిస్తున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని పర్వదినంగా జరుపుకుందాం. అందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు. అందరి జీవితాల్లోనూ ఆనందాలు, శుభాలు వెల్లివిరియాలి’ అని ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు. పీరియడ్‌ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.