కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జోనర్ ఇది. దీన్ని భారీ బడ్జెట్‌తో చేస్తు న్నారు. దీంతో సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 29న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ ఆకట్టుకోబో తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.