దెయ్యాన్ని ప్రేమిస్తే?

దెయ్యాన్ని ప్రేమిస్తే?ఆశిష్‌, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్‌ మీ’. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. ‘ఇఫ్‌ యు డేర్‌’ అనేది ఉప శీర్షిక. ఈ మూవీ నుంచి ‘రావాలి రా’ అనే పాటను శనివారం విడుదల చేశారు. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దిల్‌ రాజు మాట్లాడుతూ, ‘ఐదుగురు సింగర్లతో పాటు వైష్ణవితో కీరవాణి ఈ పాటను పాడించారు. నేను కూడా ఇంతలా హమ్‌ చేశానంటే.. అందరూ ఈ పాటను హమ్‌ చేస్తూనే ఉంటారు. కీరవాణి ఎంతో మెలోడియస్‌గా ట్యూన్‌ చేశారు. ఈ స్టోరీ విన్నప్పుడు ఓ కొత్త కథ విన్న ఫీలింగ్‌ అనిపించింది. ప్రేక్షకులు ఎలాంటి రియాక్షన్‌ ఇస్తారో చూడాలి. సినిమా చూస్తున్నంత సేపు కూడా నెక్ట్స్‌ సీన్‌ ఏంటన్నది ఊహించలేరు. ఇది చాలా న్యూ అటెంప్ట్‌’ అన్ని తెలిపారు. ‘ఇది డిఫరెంట్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ లవ్‌ స్టోరీ. ఇలాంటి కొత్త సినిమాలను ఆడియెన్స్‌ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఏప్రిల్‌ 25న మా చిత్రం రాబోతోంది’ అని హీరో ఆశిష్‌ చెప్పారు. హీరోయిన్‌ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ,’సెల్లార్‌లో అద్భుతమైన సెట్‌ వేసి ఈ పాటను షూట్‌ చేశారు. ఆ రోజు బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్‌ ప్లే అవుతుంటే నాకు ఎంతో భయం వేసింది. ఇంత మంచి పాట ఇచ్చిన చంద్రబోస్‌కి థ్యాంక్స్‌’ అని చెప్పారు. దర్శకుడు అరుణ్‌ భీమవరపు మాట్లాడుతూ, ‘ఘోస్ట్‌ని లవ్‌ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచననే ఈ సినిమా’ అని అన్నారు.