కార్యదర్శిగా దేవజిత్‌!

Devjit as secretary!– 12న బీసీసీఐ ఎస్‌జీఎం
ముంబయి : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి పదవికి తాత్కాలిక కార్యదర్శి దేవజిత్‌ సైకియ నామినేషన్‌ దాఖలు చేశారు. అస్సాం ప్రభుత్వం అడ్వకేట్‌ జనరల్‌గా సైతం కొనసాగుతున్న దేవజిత్‌.. 12న ముంబయిలో జరిగే ఎస్‌జీఎంలో ఏకగీవ్రంగా ఎన్నిక కానున్నాడు. గుజరాత్‌ క్రికెట్‌ సంఘం నుంచి నత్వాని బరిలో ఉంటారని వార్తలొచ్చినా.. కార్యదర్శి పదవికి సైకియ మినహా మరొకరు నామినేషన్‌ వేయలేదు. కోశాధికారి పదవికి చత్తీశ్‌గఢ్‌ క్రికెట్‌ సంఘం నుంచి ప్రభుతేజ్‌ భాటియా బరిలో నిలిచారు. ఎస్‌జీఎంకు బెంగాల్‌ ప్రతినిధిని ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ఏకె జ్యోతి గుర్తించలేదు. గడువు ముగిసిన తర్వాత ప్రతినిధి పేరును ప్రతిపాదించగా ఎలక్ట్రోరల్‌ కాలేజ్‌లో నమోదు చేయలేదు. సైకియ ప్రస్తుతం సంయుక్త కార్యదర్శిగా ఉండగా.. ఆ పదవికి మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.