జాతరకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించాలి

– జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఏసీపీ సతీష్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులు, ప్రజలు పోలీసుల సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో  సమ్మక్క సారక్క లను దర్శించుకుని వెళ్లాలని హుస్నాబాద్ ఏసిపి సతీష్ సూచించారు. మంగళవారం  హుస్నాబాద్ పట్టణ శివారు తో పాటు డివిజన్ లో జరిగే  సమ్మక్క సారక్క జాతర ప్రదేశాలను హుస్నాబాద్ ఏసిపి సతీష్, సీఐ ఎర్రల్ల కిరణ్, అక్కన్నపేట ఎస్ఐ వివేక్ పరిశీలించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి సతీష్, మాట్లాడుతూ  పోలీసులు చూపించిన ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని ,రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని తెలిపారు . ప్రజలకు ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. జాతర జరుగు ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జాతర నిర్వహించే నిర్వాహకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.