
శుక్రవారం నాడు మహాశివరాత్రి ని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజల కోసం శివాలయాలకు పోటీచేచ్చారు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ సమీపంలో గల శివాలయానికి అలాగే మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సోమలింగాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా మహిళా భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టగా ఆలయాల వద్ద భజన కీర్తనలు నిర్వహించారు.