ఏకశిలా పర్వతానికి పోటేత్తిన భక్తజనం

– రామలింగేశ్వరుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌
నవతెలంగాణ-కుల్కచర్ల
కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పాంబండ (ఏకశిలా పర్వతం)రామలింగేశ్వర స్వామి బ్రహ్మౌత్సవాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండం కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో సుధాకర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ నర్సమ్మ రాములు, అర్చకులు దశరథం, పాండు, ప్రశాంత్‌ జాగ్రత్తలు తీసుకున్నారు. స్వామి వారి దర్శనం సామాన్య భక్తులకు దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.