సమ్మక్క సారలమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం 

– వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్న భక్తజనం
– లక్షకు పైగా హాజరైన భక్తజనం
 – ముగిసిన సమ్మక్క సారలమ్మ జాతర 
నవతెలంగాణ – కోహెడ  
మండలంలోని పరివేద, వింజపల్లి, తంగళ్ళపల్లి గ్రామ శివారు మోయ  తుమ్మెద నది తీరాన వెలసిన  సమ్మక్క సారలమ్మ జాతర జనసంద్రమైంది. సుమారు లక్షల పైగా భక్తులు హాజరై మినీ మేడారాన్ని తలపించింది. గ్రామస్తులు  సమ్మక్క జాతరస్థలానికి చేరుకుని వనదేవతలైన సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.  బుధవారం నుండి భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవార్ల వద్దకు చేరుకొని, బుధవారం బిడ్డసారాలమ్మ  గద్దెకురాగా అలాగే గురువారం తల్లి సమ్మక్క రావడంతో భక్తులు శుక్రవారం నుండి అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతరకు మునుపెన్నోడు లేనివిధంగా భక్తులు రావడంతో రాకపోకలకు  తీవ్ర ఆటంకం కలిగింది. కమిటీ సభ్యులు పోలీసుల జోక్యంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్, స్థానిక ఎస్సై సిహెచ్ తిరుపతి, పర్యవేక్షించారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మొక్కలు సమర్పించుకున్నారు. ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, జడ్పీటీసీ, నాగరాజు శ్యామల,తాజా మాజీ సర్పంచ్ పాము నాగేశ్వరి శ్రీకాంత్, ఎంపీటీసీ కొనే శేఖర్, లు హాజరై మొక్కలు సమర్పించారు. మునిపెన్నడూ లేనివిధంగా జాతరలో  విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. చుట్టుకొండలు కొండల పక్కనే సెలయేరు,  పక్కన సింగరాయ ప్రాజెక్టు  ఉండడంతో భక్తులు రెండు రోజులపాటు ఇక్కడే సేద తీరారు శుక్రవారం సాయంత్రం వివిధ రకాల వాహనాలతో తిరుగు ప్రయాణమయ్యారు.  మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు వారి వారి మొక్కలను సమర్పించుకున్నారు. అలాగే తంగళ్ళపల్లి గ్రామం తో పాటు పరివేద, వింజపల్లి  గ్రామాలలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు హాజరై ముక్కులు సమర్పించుకున్నారు.