పాదయాత్ర భక్తులకు పండ్ల ఫలాలు అందజేత ఏఎంసి వైస్ చైర్మన్ కు భక్తులు ఘన సన్మానం

నవతెలంగాణ – మద్నూర్
ఆదివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో గల శ్రీ సాయి బాబా ఆలయం నుండి పాదయాత్రగా బయలుదేరిన భక్తులకు డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో పాదయాత్ర భక్తులకు మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆ గ్రామస్తులు కలిసి పండ్లు ఫలాలు అందజేశారు. పాదయాత్ర భక్తులు పండ్లు ఫలాలు అందజేసిన మద్నూర్ ఎఎంసి వైస్ చైర్మన్ కు శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం మద్నూర్ షిరిడి సాయిబాబా ఆలయం నుండి నెమలి సాయిబాబా ఆలయానికి పాదయాత్ర  భక్తులు చేపట్టడం ఎంతో సంతోషకరమని ఏఎంసి వైస్ చైర్మన్ పేర్కొన్నారు.