గాంధారి నుండి పండరీపూర్ కు పాదయాత్రగా బయలుదేరిన విఠలేశ్వర భక్తులు

Devotees of Vithaleshwar set out on a pilgrimage from Gandhari to Pandaripurనవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రం నుండి పండరీపూర్ దేవస్థానం వరకు పాదయాత్రగా బయలుదేరు తున్న విఠలేశ్వర స్వామి భక్తులను కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీ తూర్పు రాజులు కండువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తూర్పు రాజులు  మాట్లాడుతూ.. ప్రజలు అందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ప్రజలందరిపై విఠలేశ్వరుని కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, సుమారుగా 42 రోజుల వరకు పాదయాత్ర చేపట్టిన విఠలేశ్వర స్వామి భక్తులను అభినందించారు, వారిని సాదరంగా సాగనంపారు, ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు కూడా పాదయాత్ర చేయడం విశేషం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్,  సీనియర్ నాయకులు రమేష్ పటేల్, దేమి శ్యామ్, తూర్పు గంగ రాజయ్య, గాండ్ల రాజు, భక్తులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.