నవతెలంగాణ- మునుగోడు
యేసు నామకరణ దేవాలయ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం మండల కేంద్రంలోని కమ్మగూడెం యేసు నామకరణ దేవాలయంలో ప్రతి ఏడాది ఆనవాయితీగా సమర్పించే కొవ్వొత్తుల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. బ్యాండ్ వాయిద్యాలతో భక్తులందరూ ప్రార్థనా మందిరానికి చేరుకున్నారు. దేవాలయంలో ప్రతి ఒక్కరు కొవ్వొత్తులు వెలిగించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం యేసు నామకరణ కళావేదిక నందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మత గురువులు, సంఘ పెద్దలు, గ్రామ క్రైస్తవులు పాల్గొన్నారు.