కందకుర్తి గోదావరిలో పుణ్య స్థానాలను ఆచరిస్తున్న భక్తులు

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో ఆదివారం పుణ్య స్థానాలను ఆచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పుణ్య స్థానాలను ఆచరించి గోదావరి మధ్యలో ఉన్న రాతి శివాలయం పైకి తేలడంతో పూజలు పున ప్రారంభం అయ్యాయి. రాతి శివాలయంలో ప్రత్యేక పూజలను చేసి తమ మొక్కలను తీర్చుకున్నారు. అనంతరం గోదావరి తీరం ఉన్న ఆలయాలను వారు సందర్శించారు.